ఏపీలో మ‌రో దారుణం..మైన‌ర్ బాలిక ఫోటోలు మార్ఫింగ్ చేసి.!

ఏపీలో మ‌రో దారుణం చోటు చేసుకుంది. ఏలూరు రూరల్ మహేశ్వరపురంలో మైనర్ బాలికను ఓ యువ‌కుడు వేధింపులకు గురిచేశాడు. మైనర్ బాలిక ఫోటోను యువ‌కుడు అసభ్యకరంగా చిత్రీక‌రించి సోషల్ మీడియాలో పోస్టుచేసాడు. యువ‌కుడు అదే గ్రామానికి చెందిన భాస్కర్ గా గుర్తించారు. పోస్టును చూసి బాలిక తల్లిదండ్రులకు వారి బంధువులు ఫోన్ చేసి తెలిపారు. దాంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ కు గుర‌య్యారు. యువ‌కుడిపై ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ ఫిర్యాదు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

child rape cases
child rape cases

ఇక రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై వ‌రుస ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ప్రేమ పేరుతో ఓ యువ‌కుడు యువ‌తిని హ‌త‌మార్చ‌గా రీసెంట్ గా దుర్మార్గులు భ‌ర్త‌తో వెళుతున్న మ‌హిళ‌పై దాడి చేసి అత్యాచారానికి పాల్ప‌డ్డారు. దాంతో వ‌రుస‌గా రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. క‌ఠిన చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తూ నింధితుల‌ను శిక్షిస్తున్నా మార్పు రాక‌పోవ‌డ ఆందోళ‌న క‌లిగిస్తోంది.