దేశ వ్యతిరేఖతకు పాల్పడుతున్న 16 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం

-

దేశ వ్యతిరేఖతను ప్రేరిపిస్తూ, ప్రజల మధ్య విభజన తీసుకువచ్చేలా ప్రయత్నిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝులిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెళ్లను, వెబ్ సైట్లను నిషేధించారు. పాక్ అనుకూలంగా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది సమచార, ప్రసార మంత్రిత్వ శాఖ.

తాజాగా మరో 16 యూట్యూబ్ వార్తా ఛానెళ్లను బ్లాక్ చేసింది. ఇందులో 10 ఇండియాకు సంబంధించినవి ఉండగా… మరో 6 పాకిస్తాన్ కు సంబంధించిన ఛానెళ్లు ఉన్నాయి. దేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియాలో భయాందోళనలు సృష్టించేందుకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఈ యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రస్తుతం బ్లాక్ చేసిన వార్తా ఛానెళ్లకు 68 కోట్ల మంది పైగా వ్యూయర్స్ ఉన్నారు. గతంలో కూడా ఇలాగే కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేలా… దేశంలోని నాయకులను కించపరిచేలా.. దేశ సమగ్రతను దెబ్బతీస్తున్న ఛానెళ్లను బ్లాక్ చేసింది కేంద్రం.

 

Read more RELATED
Recommended to you

Latest news