పండుగ రోజు పూజకోసం వెళ్లి…

-

మకర సంక్రాంతి సందర్భంగా మహారాష్ట్రలోని నందర్బార్‌ జిల్లా నర్మదా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. నదీమతల్లికి పూజలు చేసేందుకు వెళ్లి మంగళవారం 60 మందితో పడవ నదిలోకి వెళ్లిన క్రమంలో భూషణ్‌గావ్‌ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి 36 మందిని కాపాడిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారంతా సమీప గ్రామాలకు చెందిన గిరిజనులుగా గుర్తించారు. సామర్థ్యం మించి పడవలో ప్రయాణీకులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా వెల్లడైందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో తప్పిపోయినవారిని నదిలో గాలిస్తున్నారు. పండుగ వేళ ఇలాంటి ఘటన జరగడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అమలుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version