అవును.. వైఎస్ జగన్ తో ఇవాళ కేటీఆర్ తో కూడిన బృందం చర్చలు జరపనుంది. దేనికి అంటారా? సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆయనతో మాట్లాడటానికే కేటీఆర్ తో కూడిన బృందం ఇవాళ హైదరాబాద్ లో జగన్ ను కలవనుంది. ఫెడరల్ ఫ్రంట్ గురించి వైఎస్సాఆర్సీపీతో చర్చించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో జగన్ ను కలిసి ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో కేటీఆర్ బృందం ఇవాళ జగన్ తో చర్చించనుంది.
బీజేపీయేతర, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ కోసం సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దేశంలోని పలు పార్టీల నేతలను కలిశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ను కేసీఆర్ కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ పై వాళ్లతో చర్చించారు. ఇప్పుడు జగన్ తో కూడా ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరపనున్నారు.