ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు టికెట్ కేటాయించడంతో మిగిలిన పార్టీలు ధర్నాలు చేస్తున్నారు. తాజాగా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేత బొడె ప్రసాద్ అనుచర వర్గం ధర్నాలు చేస్తోంది. మరోవైపు రాజీనామా చేసే ఆలోచనలో బోడే ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాకు టికెట్ ఇవ్వకపోవడం గుండె పిండేసినట్టయిందని తెలిపారు. టీడీపీకి రాజీనామా దిశగా బోడె ప్రసాద్ వర్గం. పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని తెలిపారు. 2014-19 వరకు ఎమ్మెల్యేగా కొనసాగాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటీ రూపాయల వరకు ఖర్చు చేశాను. లోకేష్ పాదయాత్రలో కూడా బాగానే ఖర్చు చేశారు. తనకు చాలా బాధగా ఉంది. తాను చంద్రబాబు నాయుడి గారి భక్తుడినే అన్నారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ టీడీపీకి మద్దతు పలుకుతారు అని తెలిపారు.