షారుక్ ఖాన్ సినిమా పై ఆశలు పెట్టుకున్న బాలీవుడ్! ముంచుతాడో! తేలుస్తాడో.!

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఒకప్పుడు బాలీవుడ్ ను నెంబర్ వన్ స్థానం లో వుండి ఎలాడు. ఇప్పుడు ఎన్ని సినిమాలు బోల్తా కొట్టడంతో హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మనవాళ్ళు బాహుబలి 1,2 KGF హిట్ల తో దూసుకు పోతుంటే ఈర్ష్య గా చూస్తున్నారు. ఇప్పుడు హిందీ వాళ్ల ని వదలి సౌత్ ఇండియా టాలెంట్ వైపు షారుక్ దృష్టి పెట్టాడు.

తమిళ దర్శకుడు అట్లీ  దర్శకత్వంలో .. షారుఖ్ హీరోగా ‘జవాన్ అనే భారీ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న  సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. జవాన్ గా షారుఖ్ ఇంటెన్స్ లుక్ అభిమానుల్ని మెప్పించింది.షారుఖ్ ఖాన్ రేంజ్ ఎక్కడా తగ్గకుండా, బిగ్గెస్ట్ యాక్షన్ తో ఎంట్టైన్మెంట్ కూడా ఉండేలా చేస్తున్నాడట.

ఇక షారుక్ ఖాన్ తాజా చిత్రం పఠాన్ ట్రైలర్ విడుదల అయ్యి అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా పై షారుక్ ఖాన్ మాత్రమే కాకుండా బాలివుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్‌లో ఈమధ్య బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించిన చిత్రాలు చాలా తక్కువ గా ఉన్నాయి. ఇక ఈ సినిమా లో దీపిక పదుకొనె వేసుకున్న డ్రెస్ లపై దుమారం చెలరేగుతోంది. సినిమాని బాయ్కాట్ చేయాలని గోల గోల చేస్తున్నారు.అందుకే ఈ సినిమా విజయం షారుక్ కు బాలీవుడ్ కు అత్యవసరం అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news