నేను శిల్పా శెట్టి సిస్టర్ తో డేటింగ్ లో లేను… ఫ్రెండ్స్ అంతే: బాలీవుడ్ నటుడు

-

సినిమా పరిశ్రమలో ఎక్కువగా రూమర్లు బాగా వ్యాపిస్తూ ఉంటాయి. ఒకటి జరిగితే కొన్ని మీడియా చానెళ్లు వాటిని పదిరకాలుగా ఊహించి రాస్తుంటారు. కాగా తాజాగా బాలీవుడ్ కు చూడఁచిన ఒక విషయం రెండు మూడు రోజులుగా బాగా వైరల్ అవుతోంది. సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టి మరో బాలీవుడ్ నటుడు అమిర్ అలీతో కొంతకాలంగా డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా నటుడు అమీర్ అలీ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. అమీర్ అలీ మాట్లాడుతూ… నేను మరియు షమిత శెట్టి మంచి స్నేహితులం ఈ మధ్యన ఒక ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం అని రెస్టారెంట్ కు వెళ్ళాను, అయితే అనుకోకుండా అదే రెస్టారెంట్ కు షమిత కూడా రావడంతో కలిశాము. ఆ పార్టీ తర్వాత నేనే స్వయంగా షమితను ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అంటూ జరిగిన విషయాన్నీ చెప్పాడు.

 

ఈ విషయాన్ని మీడియా చానెళ్లు అర్ధం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు అమీర్ అలీ. అమీర్ అలీ ఇచ్చిన ఈ క్లారిటీ తో ఇకపై ఈ రూమర్ కు చెక్ పడినట్లే.

Read more RELATED
Recommended to you

Latest news