నెల్లూరు జిల్లా లో కీలకం అయిన సిటీ మరియు రూరల్ లో గతంలో అనిల్ మరియు శ్రీధర్ రెడ్డిలు గెలిచిన విషయం తెలిసిందే. కాగా అనూహ్య పరిణామాల కారణంగా శ్రీధర్ రెడ్డి టీడీపీకి మారిపోయాడు. ఇక గత ఎన్నికల్లో అనిల్ చేతిలో ఓడిపోయిన నారాయణ మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. దీని ఫలితంగా నెల్లూరు రాజకీయాలలో గత నాలుగు సంవత్సరాలుగా పార్టీని మరియు కేడర్ ను కాపాడుకుంటూ వస్తున్న ఇద్దరు టీడీపీ నాయకులకు అన్యాయం జరిగింది. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో టీడీపీ తరపున పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ కు సీటు ఇవ్వరు. అతనికి బదులుగా దొంగదారిలో పార్టీలోకి వచ్చిన శ్రీధర్ రెడ్డికి సీటు ఖాయం అని పొలిటికల్ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఇక సిటీ ఎమ్మెల్యే స్థానానికి సైతం నారాయణ పోటీ చేయడం పక్కా. ఈ రెండు నిర్ణయాలు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. సిటీ సీటును ఆశించిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరియు రూరల్ టికెట్ ఆశించిన అజీజ్ లు ఇప్పుడు టీడీపీ పై మరియు నారాయణ పై చాలా ఆగ్రహంగా ఉన్నారు.
నెల్లూరు సిటీ లో అనిల్ ను ఎదుర్కొని గెలవాలంటే నాకే సాధ్యం అంటూ శ్రీనివాసులు రెడ్డి చెబుతున్నారు. దీనితో టీడీపీకి ఎంతో విశ్వాసంగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి మరియు అబ్దుల్ అజీజ్ లు ఇద్దరికీ వెన్నుపోటు తప్పేలా లేదు అంటూ నెల్లూరు రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.