విజయ్ దేవరకొండకు తండ్రిగా బాలీవుడ్ స్టార్..?

-

ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఫైటర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో నటిస్తూ ఉండడం ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంటడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.

ఇటీవలే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్లైమాక్స్ ఫైట్ లో సిక్స్ ప్యాక్లో కనిపించబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఆసక్తికర వార్త కూడా అభిమానులందరినీ ఆకర్షిస్తోంది. ఫైటర్ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అయినా సునీల్ శెట్టి నటించబోతున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వుంటుందని… ఈ ఎపిసోడ్లో సునీల్ శెట్టి రౌడీ హీరో విజయ్ దేవరకొండ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Read more RELATED
Recommended to you

Latest news