విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య తేజస్వి తల్లిదండ్రులు ఈరోజు సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. తమ కూతురిని తమకు కాకుండా చేసిన వాడిని శిక్షించాలని కోరుతూ సీఎం జగన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భంగా తమకు న్యాయం చేయాలని కోరారు దివ్య తల్లిదండ్రులు. అలానే సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందిందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. తేజస్విని కుటుంబ సభ్యలు వేదన చూసి చలించిపోయిన సీఎం జగన్. వారికి 10లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ఇక బీటెక్ విద్యార్థి దివ్య తేజస్విని ఘటనపై స్పందించిన డీజీపీ దివ్య ను కిరాతకంగా హత్య చేయడం బాధాకరమని అన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని, హత్య ఘటనపై సీఎం జగన్ దృష్టి సాధించారని అన్నారు. 7 రోజుల్లో ఘటనపై చార్జిషీటు దాఖలు చేస్తామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.