కథక్ లెజెండ్ బిర్జూ మహారాజ్ కన్నుమూత

-

ప్రఖ్యాత కథక్‌ నృత్య కారుడు, పద్మ విభూషణ్‌ అవార్డు గ్రహీత పండిట్‌ బిర్జూ మహారాజు మరణించారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఢిల్లీలోని సాకేత్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇంట్లో గుండె పోటు రావడంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. బిర్జూ మహారాజ్‌ ఇక లేరనే విషయాన్ని ఆయన మనవడు స్వరాన్ష్‌ మహరాజ్ ప్రకటించారు.

కొద్ది రోజుల కింటే ఆయన మేనల్లుడు పండిట్‌ మున్నా శుక్లా కూడా మరణించారు. బిర్జూ మహారాజు అసలు పేరు పండిట్‌ బ్రిజ్‌ మోహన్‌ మిశ్రా. కేంద్ర ప్రభుత్వం తరఫున పలు దేశాల్లో బిర్జూ మహారాజు.. కథక ప్రదర్శనలను ఇచ్చారు. రష్యా, అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌ లాంటి అనేక దేశాల్లో కథక్‌ నృత్య ప్రదర్శనలను ఇచ్చారు. కథక్‌ నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చేశారు. ఇక ఆయన మృతి పట్ల పలుగురు సంతాపం తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news