రెబల్ స్టార్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హాట్ బ్యూటీ.. ఎవరంటే..?

-

ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ సినిమాలు కావడంతో ప్రతి సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాధేశ్యాం అనే సినిమాలో నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమా పూర్తి కాకముందే ఆది పురుష్ అనే సినిమాను ప్రకటించి మరింత అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటించడం ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేసింది.

ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో రాముడు సరసన సీత పాత్రలో నటించే హీరోయిన్ ఎవరు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇక తాజాగా ఆదిపురుష్ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో పాత్ర కాజల్ కి తెగ నచ్చేసిందట. దీంతో వెంటనే ఓకే చెప్పినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఇక దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news