హైదరాబాద్‌లో కాల్పుల కలకలం…!

హైదరాబాద్‌లో కాల్పులు కలకలం రేపాయి. సికింద్రాబాద్‌ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కార్యాలయంలో కాల్పుల శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. లాకర్‌ నుంచి శబ్దం వినిపించినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులకు..ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మదు రక్తం మడుగులో కనిపించాడు.

మధు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబకలహాలతోనే ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మధు ..తుపాకీతో కాల్చుకున్నాడా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.