అప్పుడు ఇలాగే జరిగింది.. టైటిల్ మాదే అంటున్న వార్నర్..!

ఐపీఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి, కానీ ప్రస్తుతం వరుస విజయాలతో ప్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం మెరుగైన రన్రేట్ తో నాలుగవ స్థానానికి చేరుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు . రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

అయితే నిన్న విజయం అనంతరం మాట్లాడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ 2016 లో టైటిల్ గెలిచిన రోజులను గుర్తు చేసుకున్నారు. 2016 లో కూడా లీగ్ దశలో అన్ని మ్యాచులు గెలవాల్సిన సందర్భంలో వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నామని.. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని… ఇక ఈ సారి 2016 లాగే టైటిల్ గెలిచి తీరుతాము అంటూ ధీమా వ్యక్తం చేశాడు డేవిడ్ వార్నర్. తమ జట్టులో బౌలింగ్ విభాగం ఎంతో పటిష్టంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.