ఉమ్ము వేస్తే అరెస్ట్ చేయడమే…!

-

కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ ఎక్కువగా ఉమ్ము లేదా నోటి నుంచి వచ్చే కొన్ని స్రావాల ద్వారా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. మన దేశంలో పాన్, గుట్కా వంటివి నమిలి బహిరంగ స్థలాల్లో ఉమ్మి వేయడంతో మన దేశంలో ఎక్కువగా జరుగుతుంది. ఎవరికి ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ వినే పరిస్థితి ఉండదు.

ఇలాంటి చెత్త అలవాట్ల వల్ల కరోనా అత్యంత వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ముంబైలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ స్థలాల్లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ముంబై నగరంలో ఇక బహిరంగంగా ఉమ్మి వేస్తే వెయ్యిరూపాయల చొప్పున జరిమానా విధించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది.

బహిరంగంగా ఉమ్మి వేసిన 107 మంది నుంచి రూ.1.07లక్షల జరిమానాను వసూలు చేశామని బీఎంసీ అధికారులు మీడియాకు వివరించారు. 46 మందికి బహిరంగంగా ఉమ్మి వేయవద్దని హెచ్చరికలు జారీ చేశామని ముంబై అధికారులు వివరించారు. కరోనా వ్యాధి విస్తరించకుండా ప్రజలు తమకు సహకరించాలని బీఎంసీ అధికారులు కోరారు. ఉమ్మి వేసిన వారికి వెయ్యిరూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news