తెలంగాణలో ఈ నెల 25 నుంచి బోనాల పండగ

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి బోనాల పండుగ జరగనుంది. ఈ నెల 25న ఉజ్జయిని మహంకాళి అమ్మ వారికి అధికారికంగా బోనాలు సమర్పించనుంది తెలంగాణ సర్కార్. అలాగే ఈ నెల 26 న ఉజ్జయిని అమ్మవారి రంగం మరియు ఊరేగింపు ఉండనుంది. తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మరియు లాక్డౌన్ ఎత్తివేత నేపథ్యంలో బోనాల పండుగ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బోనాల పండుగ లో పాల్గొనే ప్రతి ఒక్కరు మాస్కులు, భౌతిక దూరం పాటించాలని సూచనలు చేసింది.

కాగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు తెలంగాణ లోని చాలా జిల్లాల్లో ఈ బోనాల పండుగ నిర్వహిస్తారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అతి గొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను “ఆషాఢ జాతర” అని కూడా అంటారు. వర్షాలు మొదలయ్యే సమయంలో జంట నగరాలలో మాత్రమే కాకుండా.. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రదేశంలో బోనాల జాతర జరుగుతుంది.