అడ్డంగా బుక్కైన వైసీపీ నేతలు.. అమ్మాయిలతో రికార్డింగ్ డాన్సులు

-

వారంతా ప్రజల సంక్షేమం కొరకు ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు. రాష్ర్ట ప్రజలను కాపాడుతామని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసినవారు. కానీ వారే తమ స్థాయిని మరిచి మహిళలతో ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు చేశారు. గుంటూరు జిల్లా పెదకూపాడు నియోజకవర్గంలో తప్ప తాగి చిందేశారు. అసలేం జరిగిందంటే….

గుంటూరు లో వైసీపీ(YCP) నాయకులు స్థాయి మరిచిపోయి అమ్మాయిలతో కలిసి చిందేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో స్థానిక వైసీపీ నాయకుడు షేక్‌ అబ్దుల్‌ ఘనీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పార్టీలో తాగుతూ… రికార్డింగ్ డ్యాన్సుల పేర అమ్మాయిలతో ఆడిపాడారు. ఇప్పుడు ఈ ఘటనపై రాష్ర్ట ప్రజానీకం భగ్గుమంటోంది. దాదాపు 2 గంటల పాటు ఈ పార్టీ జరిగినట్లు సమాచారం. ఈ పార్టీకి అనేక మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారట. ఇలా నేతలంతా తప్పతాగి మహిళలతో చిందేస్తున్నపుడు తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు విషయం ఏంటంటే.. వీరంతా ఇలా తాగా పార్టీ చేసుకుంది రైతుల కోసమని కట్టించిన మార్కెట్ యార్డులో.

వైసీపీ /YCP
వైసీపీ /YCP

రాష్ర్టంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉండగా… రాత్రి 10 గంటల తర్వాత పార్టీలు చేసుకోవడానికి అనుమతులు ఎవరిచ్చారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా అనేక మంది ఇలా ఒకే చోట గుమిగూడేలా పార్టీ నిర్వహించిన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మార్కెట్ యార్డులో ఇలా మందు పార్టీ జరిగిన విషయం గురించి సదరు మార్కెట్ యార్డు కార్యదర్శి శంకర్ రెడ్డి స్పందించారు. అసలు అక్కడ రికార్డింగ్ డ్యాన్సులు జరిగిన విషయం తనకు తెలియదని అన్నాడు. తాము రికార్డింగ్ డ్యాన్సుల కోసం ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సత్తెనపల్లి డీఎస్పీ ఆర్‌.విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news