పెట్రోల్ రేటు పైపైకి.. పరిష్కారాన్ని కనుగొన్న తెలంగాణ వ్యక్తి.

-

రోజు రోజుకి పెట్రోల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. సెంచరీ చేరుకున్నా ధరలు పెరగడం మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో పెట్రోల్ రేట్లు 107రూపాయలుగా ఉంది. పెట్రోల్ భారాన్ని ప్రతీ ఒక్కరూ అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఐతే జనగాం కి చెందిన కూరపాటి విద్యాసాగర్ మాత్రం పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నాడు. విద్యాసాగర్ తన దగ్గర ఉన్న ద్విచక్ర వాహనానికి ఎలక్ట్రిక్ బ్యాటరీని అమర్చి చక్కర్లు కొడుతున్నాడు.

7500రూపాయల ఖర్చుతో నాలుగు 30ఏహెచ్ బ్యాటరీలను అమర్చి వాటికి ఛార్జింగ్ పెట్టి తిరుగుతున్నాడు. ఇలా ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసిన బైకు దాదాపు 50కిలీమీటర్ల మైలేజి ఇస్తుంది. ఒకసారి ఛార్జ్ చేయడానికి 1యూనిట్ ఖర్చు అవుతుందని చెబుతున్నాడు. గతంలో ఒక రోజుకి 200రూపాయలు పెట్రోల్ కి ఖర్చు అయ్యేవని, ఇప్పుడు పది రూపాయలతో సరిపోతుందని చెబుతున్నాడు. ఈ లెక్కన బ్యాటరీతో ఛార్జ్ చేసుకుంటే చాలా మిగులుతున్నట్టే లెక్క. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నందున ఇలాంటి ప్రత్యామ్నాలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news