ఏ క్షణమైనా మళ్ళీ పోరాటానికి దిగుతాం : జ‌గ‌న్ స‌ర్కార్ కు ఉద్యోగుల వార్నింగ్‌

-

ఏపీ ప్ర‌భుత్వానికి ఉద్యోగ సంఘాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఏ క్ష‌ణ‌మైన మ‌ళ్లీ పోరాటానికి సిద్దంగా ఉన్న‌ట్లు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఏడెనిమిది సంవత్సరాల నుంచి జీతాల కనీస పెంపు లేక కాంట్రాక్టు ఉద్యోగులు అల్లాడుతున్నారని… పని దోపిడీకి గురవుతున్నారని మండిప‌డ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్కాస్ పెట్టినా ఇంకా లక్ష మంది ఉద్యోగులు బయటే ఉన్నారని.. వీరికి ఈపీఎఫ్, ఈఎస్ఐ హాస్పిటల్ సదుపాయం కూడా లేదని ఆగ్ర‌హించారు.

కొంత మంది అధికారులు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కోపం వచ్చినా ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఇచ్చే రోజే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సమాన వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదని… ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని ప్రాధాన్యతలు, రాయితీలు ఇవ్వాలని కోరారు. క్యాడర్ వారీగా బేసిక్ పే ఇవ్వాలని.. ఏడాది కి ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పనిలో తేడా ఏమీ లేదు… పేరులోనే తేడా అన్నారు. వీళ్ళందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి… ఇప్పుడు కమిటీల పేరుతో కాలాయాపన చేస్తున్నారని.. 11వ పీఆర్సీ నివేదికలో 27జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news