యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా గాడ్సే. ఈ సినిమా టీజక్ విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధం అవుతుంది. సోమవారం మధ్యాహ్నం 12:01 గంటలకు మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ ను విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగ గాడ్సే సినిమా ను గోపి గణేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అలాగే సీకే స్క్రీన్స్ బ్యానర్ పై సీ కళ్యాణ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.
కాగ ఈ సినిమాలో మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి మొదటి సారి తెలుగు లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే నాసర్, సాయాజీ షిండే, కిషోర్, బ్రహ్మజీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. కాగ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రారంభం అయింది. కానీ కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఆలస్యం అవుతూ వచ్చింది. కాగ ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.