ఏపీలో జీతాలు అందక..ఆత్మహత్య చేసుకుని పరిస్థితి – బొప్పరాజు వెంకటేశ్వర్లు

-

ఏపీలో జీతాలు అందక..ఆత్మహత్య చేసుకుని పరిస్థితి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. మా ఉద్యమ కార్యాచరణ ఈనెల 9 నుంచి ప్రారంభిస్తున్నామని… కార్యక్రమ విజయవంతం కోసం రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నామని వివరించారు. ఉద్యమంపై మంత్రి బొత్స, సజ్జల ఉద్యోగ సంఘ నేతలతో చర్చించారు..ఇప్పటికే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమయం కన్నా ఎక్కువే ఇచ్చామని వారికి తెలియజేశామని తెలిపారు.


కరోనాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఉద్యోగులు పూర్తి సహకారాన్ని ఇచ్చాయి..పీఆర్సీ రాయితీలను తగ్గించి ఇవ్వడంపై రోడ్డు మీదకు వచ్చామన్నారు. మాకు బ్రతకలేని పరిస్థితి తీసుకువచ్చారు కాబట్టే ఉద్యమబాట అని.. ఉద్యోగుల రావాల్సిన బకాయిలు మాకు రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని జీవో ఇచ్చారని వివరించారు. మాకు రావాల్సిన డబ్బులు రావు.. మేము దాచుకున్న డబ్బులు ఇవ్వరు.. కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించబోరని.. ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, పెన్షన్లు ఎప్పుడిస్తారో తెలియదని జగన్ సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు. ఇది ఉద్యమం కాదు ప్రభుత్వం మర్చిపోయిన పనిని తెలియజేస్తున్నాం..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచలేదన్నారు. ఉద్యోగులు అప్పులు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news