ఆస్థి పన్ను పెంపు విషయంలో 15 శాతంకు మించి పెంచకూడదు అని నిర్ణయం తీసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈరోజు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన అయన ఈ మేరకు కామెంట్స్ చేశారు. ఆస్తిపన్ను పెంపుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన 350 గజాలు ఉన్న వారికి 50 రూపాయలు మాత్రమే పెరుగుతుందని అన్నారు. అలానే బ్యాంకులు పై చెత్త వేసిన ఘటనపై ఒక కమిటీ వేశామని ఈ అంశం మీద చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించమని అన్నారు. ఇక జనవరిలో సిట్ నివేదిక రానుందని ఆయన అన్నారు. ఇక ఈరోజు నుండి ప్రజలకు ఎన్. ఏ. డి ఫ్లై ఓవర్ అందుబాటులో రానున్నట్టు పేర్కొన్నారు. ఫ్లై ఓవర్ బ్యూటిఫికేషన్ వర్క్స్ పూర్తి చేశాకే ప్రారంభం చేస్తామన్న ఆయన ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫ్లై ఓవర్ పనులు వేగవంతం చేశామని అన్నారు. నగరంలో మరిన్ని ఫ్లై ఓవర్ నిర్మాణం, డి.పి.ఆర్ సిద్ధం చేస్తున్నామని బొత్స ప్రకటించారు.