అంగరంగ వైభవంగా కేసీఆర్ దత్త కుమార్తె పెళ్లి

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయన సతీమణి శోభమ్మల దత్త పుత్రిక ప్రత్యూష వివాహం ఈరోజు చరణ్ రెడ్డితో అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని పాటిగడ్డ లార్ధుమాత చర్చిలో ఈ వివాహ వేడుకను నిర్వహించారు. నిన్న పెళ్లి వేడుకల్లో భాగంగా నిన్న మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో ప్రత్యూషను పెళ్లి కూతురిని చేశారు. వధువుకు సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించారు. హైదరాబాద్‌లోని బండ్లగూడకు చెందిన ప్రత్యూష తల్లి 2003లో చనిపోయే ముందు తన పేర ఉన్న ఆస్తిని ప్రత్యూషకు రాసింది.

తండ్రి ఆమెను పట్టించుకోపోవటంతో బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్చించారు. 2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరిపోవడంతో ఆ తర్వాత తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. ప్రత్యూష పేరిట ఉన్న ఆస్తిని దక్కించుకునేందుకు సవతి తల్లి ప్రత్యూష మీద పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. ఆమె మీద రోజూ భౌతికదాడి చేసేది ఎన్నో రోజులకు ఈ విషయం బయటకు రాగా అంపశయ్య మీద ఉన్న ప్రత్యూషను సవతి తల్లి, తండ్రి చెర నుంచి విముక్తి కల్పించి వైద్యం చేయించారు. ఈ విషయం మీడియాలో చూసి చలించిపోయిన కేసీఆర్ ఆమెను దత్తత తీసుకున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news