చంద్రబాబు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరం : మంత్రి బొత్స

-

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ వంటి సిటీయే మునిగిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఒకసారి ఆయన విజయనగరం వచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చూడాలని సూచించారు. కుప్పం కంటే మా జిల్లా ఎంతో బాగుంటుందన్నారు. వర్షాల నేపథ్యంలో ముంపుపై విపక్షాలు విమర్శించడం మీదా బొత్స స్పందించారు. వర్షాలకు హైదరాబాదే మునిగిపోయిందని గుర్తు చేశారు. ప్రత్యేక సందర్భాలలో వచ్చే వర్షాలకు మునగడం సహజమన్నారు.

Deccan Chronicle | Education Minister Botsa Satyanarayana

మరోవైపు హైకోర్టు నోటీసులపై స్పందన బొత్స స్పందించారు. అమ్మఒడి సభకు విద్యార్థులను తీసుకువెళ్లడంపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కార్యదర్శికి హైకోర్టు నోటీసులు ఇవ్వడంపై బొత్స స్పందించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, విద్యార్థులు రావడంలో తప్పులేదన్నారు. వారు కాకుండా ఇలాంటి కార్యక్రమాలకు సినీ నటులు వస్తారా? విద్యార్థులు, తల్లిదండ్రుల రాకపై ఉన్నత న్యాయస్థానం సూచనలిస్తే పాటిస్తాం’’ అని మంత్రి బొత్స వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news