అమరావతి స్మశానమే అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాడు పర్యటనకు వస్తుంటే.. ఏముంది ఇక్కడ స్మశానం తప్ప అన్నాననని… ఇది స్మశానమే అనే నాటి మాటలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు మంత్రి బొత్స. బీజేపీ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో స్థానం లేదు.. రోజుకో మాట మాట్లాడుతారని ఆగ్రహించారు. మా తాజా నిర్ణయంలో తడబాటు లేదు.. ఎడబాటు లేదని స్పష్టం చేశారు.
వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లుపై ముఖ్యమంత్రి జగన్ శాసనసభ లో స్పష్టంగా ప్రకటన చేశారని… అందరితో చర్చించే వికేంద్రీకరణ చట్టం తెచ్చామన్నారు. అపోహలు, అభిప్రాయ బేధాలతోనే అమలు్లో ఇబ్బందులు వచ్చాయని… ఎలాంటి చిక్కులు, ఇబ్బందులు రాకుండా మళ్ళీ బిల్లును తీసుకు వస్తాని ప్రకటన చేశారు. మూడు ప్రాంతాల అభివృద్ధి టకి మళ్ళీ వేగంగా నిర్ణయం తీసుకుంటామని… అమరావతి రైతుల మనసులో ఉన్నవన్ని చేయలనంటే ప్రభుత్వానికి ఎలా సాధ్యం..? అని ప్రశ్నించారు. అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఉంది కాని చేయనీయకుండా అడ్డుకున్నారని… బీజేపీది రెండు నాల్కల ధోరణి అంటూ ఫైర్ అయ్యారు. అందుకే ఇవాళ రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారన్నారు.