హైదరాబాద్ లాంటి చారిత్రక తప్పిదాన్ని మళ్లీ చేయం- సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల రద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. తాము ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లును వెనక్కితీసుకుంది. తాజాగా ఈ బిల్లు విజయవంతంగా అసెంబ్లీలో నెగ్గింది. పరిపాలన వికేంద్రీకరణ అవశ్యతకను వివరిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ కూడా మూడు రాజధానుల బిల్లు రద్దు చేసిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మరో కొత్త బిల్లుతో ప్రజల ముందుకు వస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… మరోసారి హైదరాబాద్ వంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దని అన్నారు. అటువంటి చారిత్రక తప్పిదానికి మరోసారి ప్రభుత్వం పాలుపడరాదని అన్నారు. కాబట్టి వికేంద్రీకరణ సరైన నిర్ణయమని నమ్మామని జగన్ అన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల ఆకాంక్షలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని.. విస్రుత, విశాల ప్రజాప్రయోజనాలు కాపాడేందుకు రాబోయే రోజుల్లో మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని జగన్ అన్నారు.

చదువుకున్న మన పిల్లలు హైదరాబాద్, బెంగళూర్, చెన్నై లాంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిందేనా..? మనకు అలాంటి రాజధాని ఉండదా..? అనే ఆలోచనల్లోంచి పుట్టిందే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిట్ అన్నారు. మరో 5 ఏళ్లలో విశాఖ హైదరాబాద్తో పోటీ పడుతుందని జగన్ అన్నారు.