సీఎం జగన్‌ ఓ తుగ్లక్ 3.0, పెద్ద మూర్ఖడు : నారా లోకేష్

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తుగ్లక్ 3.0! మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అంటూ చురకలు అంటించారు నారా లోకేష్‌. అసెంబ్లీ ని అసత్య వేదికగా మార్చేశారని ఫైర్‌ అయ్యారు.

ys jagan on nara lokesh

ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానుల కోసం ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్ అంటూ చురకలు అంటించారు నారా లోకేష్‌. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని అంటూ తన ట్విట్టర్‌ వేదికగా.. నారా లోకేష్‌ జగన్‌ పై ఫైర్‌ అయ్యారు. అంతేకాదు.. ఈ వ్యాఖ్యలకు జగన్‌ గతంలో మాట్లాడిన వీడియోను కూడా జత చేశారు నారా లోకేష్‌. కాగా.. ఇవాళ మూడు రాజధానుల బిల్లు ను జగన్‌ సర్కార్‌ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాసేపటి క్రితమే సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు.