మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లు నేపథ్యంలో ఎన్ఐటీలలో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు వచ్చేస్తామన్నారని, ఈ విషయమై సీఎం జగన్‌తో మేమంతా సంప్రదింపులు చేస్తూ.. రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగు చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇందుకోసం ఇప్పటికే హెల్ లైన్ ఏర్పాటు చేశామని, ఎవ్వరున్నా మాకు సమాచారం ఇవ్వండని, ప్రతిఒక్కరినీ తీసుకువస్తామని, విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్యపడవద్దని మంత్రి బొత్స వెల్లడించారు. ముందగా.. 150 మందికి తీసుకు రావటానికి అవసరమైన ఏర్పాటు చేశామని, ప్రత్యేక విమానాలను ఏర్పాట్లు చేయడం వలన ఆలస్యం జరుగుతోందన్నారు. ఇప్పటివరకు 100 మంది విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకున్నారని బొత్స వెల్లడించారు. మరో 50 మంది ఏపీ విద్యార్థులు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని అన్నారు. 150 మందిని తీసుకువచ్చేందుకు విమానం ఏర్పాటు చేశామని తెలిపారు.
మణిపూర్ నుంచి విద్యార్థుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముగ్గురు ఐఏఎస్ లను నియమించామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ (కాంటాక్ట్ నెం.88009 25668), ఏపీ భవన్ ఓఎస్డీ రవిశంకర్ (కాంటాక్ట్ నెం. 91871 99905) తరలింపు చర్యలు పర్యవేక్షిస్తారని వివరించారు. వర్షాలకు పంట నష్టం లేదు.. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని చెప్పామని, పార్వతీపురంలో అరటి కాస్త నష్టం ఉందన్నారు.