రైల్వే ప్రయాణికుల కోపానికి టీసీలు బలి.. బాడీ కమెరాలు ఇవనున్న సెంట్రల్‌ రైల్వే

-

ఏ ఉద్యోగంలో అయినా పని ఒత్తిడి, బాస్‌ చేసే చివాట్లు ఉండటం కామన్.. కానీ కొన్ని జాబ్‌లలో ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు.. ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలి అవుతారు.. చితకబాదేస్తారు.. అలాంటి వాటిల్లో టీసీ ఉద్యోగం కూడా ఒకటి.. పాపం టీసీలను ప్రయాణికులు కొడుతున్నారట.. ఇలాంటి ఘటనలు ఒకటి రెండు కాదు.. లెక్కలేనన్ని జరుగుతున్నాయి.. అది ఎంత ప్రభుత్వ ఉద్యోగం అవని.. ప్రయాణికులు అంతా కలిసి కొడుతుంటే.. ఆ టైమ్‌కు ఎవరూ అడ్డుకోలేరు కదా..! ఇలాంటి ఘటనలు ఎక్కువవుతుండటంతో… సెంట్రల్ రైల్వే (CR).. కొత్త ప్లాన్‌ అమలు చేయబోతోంది. దీని ప్రకారం… 1,300 బాడీ కెమెరాలను టీసీలకు ఇవ్వనుంది. ముంబై డివిజన్‌లో టీసీలకు ముందుగా బాడీ కెమెరాలు ఇవ్వనున్నారు.

ప్రస్తుతం ముంబై లోకల్ ట్రైన్లలోకి టీసీలు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్ కండీషన్ ఉన్న బోగీలలోకి టీసీలు వెళ్లట్లేదు. ఎందుకంటే ఆ బోగీలలో చాలా సమస్యలు ఉంటున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఉంటున్నారు. పొరపాటున టీసీ ఆ బోగీలలోకి వెళ్తే… “టికెట్ సరే.. ముందు సౌకర్యాలు ఏవి” అని ప్రయాణికులు టీసీలకు కుమ్మి వదిలిపెడుతున్నారు.. అందుకే ఆ బోగీల లోకి వెళ్లకుండా టీసీలను నిలువరించారు.

దాడులు ఆపలేకపోయినా.. శిక్ష అయితే వేయొచ్చు..

టీసీలు బాడీ కెమెరాల్ని ధరిస్తే.. ప్రయాణికులు దాడి చేస్తే.. వాటిలో రికార్డ్ అయిపోతుంది. దాంతో.. ఆ ప్రయాణికులపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదీ కాక.. కెమెరా ఉంది అనే ఉద్దేశంతో ప్రయాణికులు దాడి చెయ్యకుండా నెమ్మదిగా ఉంటారని రైల్వే అధికారులు భావిస్తున్నారు..

ముందుగా 50 కెమెరాలను టీసీలకు ఇవ్వనున్నారు. పరిస్థితి ఎలా ఉందో ఓ రెండు వారాలు గమనిస్తారట. ఆ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయో చూస్తారు. కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్‌ను క్లౌడ్ స్టోరేజ్‌లో ఉంచుతారు. తద్వారా ఎప్పుడు కావాలన్నా డేటా వెనక్కి తీసుకునే వీలుంటుంది.. టీసీలు అక్రమాలకు పాల్పడకుండా, కమిషన్లు తీసుకోకుండా ఉండేందుకు కూడా ఈ కెమెరాలు ఉపయోగపడనున్నాయి. టికెట్ లేకుండా ప్రయాణించే వారికి ఫైన్ వెయ్యకుండా.. లంచం తీసుకోవాలని చూసే టీసీకి ఈ కెమెరాలు బ్రేక్ వేస్తాయని భావిస్తున్నారు. చూడాలి వీటి ప్రభావం ఎంత మేర ఉంటుందో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version