పవన్ కళ్యాణ్ గంటకో కులం మారుస్తాడని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే తాపత్రయంతో బురదజల్లే ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నారని.. పవన్ కళ్యాణ్ ది సెలబ్రిటీ పార్టీ అని చురకలు అంటించారు. మూడ్ వచ్చినప్పుడు మాట్లాడే నాయకుడు పవన్ కళ్యాణ్…..ఆయన వైఖరి చూస్తుంటే జా లేస్తోందని.. నిర్దిష్టమైన లక్ష్యం ఉంటే నీతి., నిజాయితీ తో పోరాడాలి…… ఆ విధంగా చేస్తే ఏ 30 ఏళ్లకో అవకాశం వస్తుందన్నారు బొత్స.
అప్పుడు వరకు ఎన్ని చేసిన వేస్ట్ అని ఎద్దేవా చేశారు బొత్స. రాజకీయాల్లోకి వచ్చి టాటా., బిర్లాల మాదిరిగా ఎక్కడ ఎదిగిపోయానో పవన్ కళ్యాణ్ చెప్పగలరా….? బలహీన వర్గాలకు భ్రాండ్ అంబాసిడర్ లాంటి పార్టీ వైసీపీ అన్నారు. బీసీలు మా ప్రభుత్వానికి,పార్టీకి బ్యాక్ బోన్ అని ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పారని.. పక్క రాష్ట్రంలో బీసీలకు జరుతున్న అన్యాయంపై పవన్ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని నిప్పులు చెరిగారు బొత్స. నా కంటే ముందు తూర్పు కాపు కులంలో చాలా మంది మంత్రులు చేశారు…..నేను వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధి చెందానో పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు.