ఇప్పటి నుంచైనా పవన్ అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది : బొత్స

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరో సారి సంచలన కామెంట్స్ చేశారు. ఏదైనా అంశంపై మాట్లాడే ముందు పవన్ కల్యాణ్ అవగాహనతో మాట్లాడాలని సూచించారు. ఒక వేళ ఆయనకు అవగాహన లేకపోతే ట్యూషన్ కి వస్తే తాను వివరిస్తానన్నారు. ఇప్పటి నుంచైనా పవన్ అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు కేసులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని పవన్ కోరాలని డిమాండ్ చేశారు. ఏపీలో టీడీపీ-జనసేన అధికారంలోకి రావడానికి కనుచూపు మేరలో కూడా అవకాశాలు కనపడటం లేదన్నారు బొత్స.

కాంగ్రెస్ హయాంలో విద్యా మంత్రిగా ఉన్నానని, అప్పుడు తమమీద ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించుకున్నామని అన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ని వారి పార్టనర్ మీద సీబీఐ విచారణ జరిపించమని అడగాలన్నారు. . ఇప్పటి నుంచైనా పవన్ అన్ని విషయాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. బైజుస్ ఒప్పందంపై దమ్ముంటే పవన్ కళ్యాణ్ సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేయాలని పేర్కొన్నారు. టీడీపీ , జనసేన అధికారంలోకి రావడం కల్ల…సమీప భవిష్యత్తులో అటువంటి అవకాశం లేదని ఎద్దేవా చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారంలోకి వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ కలలు కంటున్నారని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. బైజుస్ కంటెంట్ రాష్ట్రంలో చదువున్న విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బైజ్యుస్, ఐబీ కోసం ఒక్క రూపాయి కట్టినట్టు నిరూపించగలిగితే అప్పుడు మాట్లాడాలని ఫైర్‌ అయ్యారు. ఎంసెట్ కౌన్సిలింగ్ పై స్పష్టత ఇచ్చిన బొత్స సత్యన్నారాయణ.. మూడోవిడత కౌన్సిలింగ్ కోసం తల్లిదండ్రుల నుంచి వినతులు వస్తున్నాయని వెల్లడించారు. అడ్మిషన్ల పై విధాన పరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని ప్రకటించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version