కరోనా ఆస్పత్రి కోసం తన భవనాన్ని ఇచ్చేసిన అమీర్ ఖాన్…!

కరోనా వైరస్ పై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు పలువురు. ప్రభుత్వాలకు ఆర్ధిక సహాయం చేయడమే కాకుండా వారికి తోచిన విధంగా మద్దతు ఇస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ పై చేసే పోరాటంలో భాగంగా బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్ తమ దేశ ఆరోగ్య అధికారులకు సహాయం అందించారు. COVID-19 రోగులను ఉంచడం కోసం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని,

నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) కు తన నాలుగు అంతస్తుల భవనాన్ని అందిస్తానని అతను సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. 33 ఏళ్ళ ఈ బాక్సర్ రెండు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు. తన 60,000 చదరపు అడుగుల భవనం ముందు నిలబడి ఉన్న ఒక ఫోటో పోస్ట్ చేస్తూ… “ఈ విషాద సమయంలో ఆసుపత్రి బెడ్ పొందడం” ఎంత కష్టమో తనకు తెలుసు అని అతను పేర్కొన్నాడు.

తన కొత్త “వెడ్డింగ్ హాల్ మరియు రిటైల్ అవుట్లెట్” భవనాన్ని “కరోనావైరస్ బారిన పడిన ప్రజలకు సహాయపడటానికి” ప్రబ్భుత్వానికి అందించడానికి సిద్ధంగా ఉన్నానని అతను పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో వివాహల హాల్ గా ఈ భవనాన్ని అతను ప్రారంభించాలి. అందరూ సురక్షితంగా ఉండాలని పేర్కొన్నాడు. బ్రిటన్ ప్రధానికి కూడా కరోనా వైరస్ సోకడం ఇప్పుడు ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.