కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు కూడా ప్రజలకు ధైర్యాన్ని చెబుతున్నాయి. కానీ కొందరు ఆకతాయిలు మాత్రం వీటిని ఏ మాత్రం లెక్కచేయకుండా సోషల్ మీడియాను వాడుకుని ఇష్టారీతిన పోస్టులు పెడుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది..
బెంగళురు ఇన్ఫొసిస్ లో పనిచేస్తున్న ముజీబ్ మహ్మద్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో కరోనా వైరస్ పై పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు కలిగించేవిలా ఉండటంతో పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పోలీసులు అతనిపై చర్యలు తీసుకోకుండా మజీబ్ పనిచేసే కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అతనిపై మీరు చర్యలు తీసుకుంటారా లేక మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా అని ప్రశ్నించారు. దీంతో విషయం గ్రహించిన ఇన్ఫోసిస్ యాజమాన్యం అతణ్ణి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
అతనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సంస్థ తరపున పూర్తి సహాయం అందిస్తామని కూడా తెలిపింది. కొందరు ఆకతాయిలు బాధ్యతారాహిత్యంతో చేస్తున్న కొన్ని తప్పుడు ప్రచారాల వల్ల ప్రజల్లో మరింతగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. సో బీకేర్ ఫుల్..