కోపంతో ఉన్న ఎద్దు నుంచి త‌న బామ్మ‌ను ర‌క్షించుకున్న బాలుడు.. వైర‌ల్ వీడియో..!

-

ఆగ్ర‌హంతో ఉండే ఎద్దుల‌ను స‌ముదాయించడం ఎవ‌రి వ‌ల్లా కాదు. అస‌లు వాటి ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకే ఎవ‌రైనా భ‌య‌ప‌డ‌తారు. ఎందుకంటే.. అవి కొమ్ముల‌తో కుమ్మి ప‌డేస్తాయి. అయితే ఆ విష‌యం తెలిసి కూడా ఆ బాలుడు త‌న బామ్మ‌ను ర‌క్షించేందుకు అత్యంత ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌ద‌ర్శించాడు. దీంతో అత‌న్ని నెటిజ‌న్లు మెచ్చుకుంటున్నారు.

boy saved his grand mother from mad bull viral video

హ‌ర్యానాలోని మ‌హేంద‌ర్ గ‌ఢ్‌లో ఈ సంఘ‌ట‌న సెప్టెంబ‌ర్ 28న చోటు చేసుకుంది. వీధిలో ఉన్న ఓ ఎద్దు అటుగా వెళ్లే ఓ వృద్ధురాలిని కుమ్మి ప‌డేసింది. అది చూసిన ఆమె మ‌న‌వ‌డు అటుగా వ‌చ్చాడు. కానీ అత‌న్ని కూడా ఎద్దు కొమ్ముల‌తో పొడిచింది. అయిన‌ప్ప‌టికీ అత‌ను త‌ప్పించుకుని వ‌చ్చి ఆ వృద్ధురాలిని ఎద్దు బారి నుంచి ర‌క్షించాడు.

అయితే వీధిలో వారి అరుపులు విన్న ప‌క్క ఇళ్ల వారు వ‌చ్చి ఎద్దును అదిలించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ దృశ్యాలు అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అది ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. కాగా ఆ వృద్ధురాలిని ర‌క్షించేందుకు ఆ బాలుడు చూపిన ధైర్య సాహ‌సాల‌కు అంద‌రూ అత‌న్ని ఎంత‌గానో మెచ్చుకుంటున్నారు. నిజంగా అత‌ను హీరో అని ప్ర‌శంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news