బాబు లో పశ్చాతాపం.. చినబాబు మనస్థాపం ?

-

టిడిపి అధినేత చంద్రబాబు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో తాను అనుసరించిన వైఖరి, పార్టీ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణాలు ఏంటి అనే విషయాలపై చంద్రబాబు లోతుగానే విశ్లేషించుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన వ్యూహాత్మక రాజకీయ తప్పిదాలకు ఇప్పుడు ఫలితం అనుభవించాల్సి వస్తుందనే బెంగాల్లో బాబు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

అప్పుడు పూర్తిగా ప్రభుత్వ పరిపాలనపైనే దృష్టి సారించడం, అమరావతి వ్యవహారాల్లో బిజీగా ఉండడం, విభజన కష్టాల నుంచి గట్టెక్కించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించడం ఇలా చాలా కారణాలతో తెలుగుదేశం పార్టీని పట్టించుకోలేదని, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సైతం పెద్దగా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాస్తవాలను గుర్తించకుండా, కేవలం అధికారుల మీదే పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం, వారి చెప్పింది నిజమని నమ్మడం, ఇలా అనేక కారణలతో, సొంత పార్టీ నాయకులు విచ్చలవిడిగా అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలినా పట్టించుకోనట్టుగా వ్యవహరించడం ఇలా చాలా కారణాలతో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగి, ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది అనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారు.

అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాను అనే విమర్శలు వచ్చినా, పార్టీకి సంబంధించిన విషయాలపై పూర్తిగా దృష్టి పెట్టి, ఎక్కువగా పార్టీ భవిష్యత్తుని తీర్చిదిద్ది, తిరుగులేకుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులతో జిల్లాల వారీగా జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న సమావేశాల్లో ఈ మేరకు బాబు పశ్చాత్తాపం చెందుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు అయిందేదో అయింది అని, ఇకపై పూర్తిగా పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టి, రానున్న రోజుల్లో యువతకు పార్టీలో పెద్దపీట వేస్తామని, పార్టీ నాయకులంతా సమిష్టిగా కష్టపడి తిరిగి పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని బాబు పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్నారు.

చంద్ర బాబు బాధను పార్టీ శ్రేణులు సైతం అర్థం చేసుకుంటూ, ఇకపై పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవ్వాలనే ఉత్సాహంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. టిడిపి యువ నాయకుడు చంద్రబాబు తనయుడు లోకేష్ వ్యవహారం మాత్రం మరోలా ఉంది. చంద్రబాబు కమిటీల పేరుతో చురుకైన యువ నాయకులను ప్రోత్సహిస్తున్నారని, ముఖ్యంగా టిడిపి అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియమించడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తుకు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారనే అభిప్రాయాలు ఆయనలో ఉన్నాయి.పూర్తిగా మిగతా నాయకులు అంతా డామినేట్ చేస్తే తనను ఎవరు పట్టించుకోరు అనేది లోకేష్ అభిప్రాయంగా కనిపిస్తోంది.

అందుకే పూర్తిగా తనతో పనిచేసే నాయకులకు పార్టీ పదవులు అప్పగించాలని,  పార్టీతో పాటు తన రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి డోకా లేకుండా చూడాలని లోకేష్ తనకు అత్యంత సన్నిహితులైన పార్టీ నాయకుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టిడిపి పదవుల్లో లోకేష్ మాట విని పార్టీకి ఉపయోగపడని వారికి పదవులు ఇచ్చినా ఉపయోగం ఉండదని, ముందు ముందు పార్టీ భవిష్యత్తు బాగుంటేనే లోకేష్ రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుందనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తున్నారు. మొత్తంగా చూస్తే టిడిపిలో పార్టీ పదవులు వ్యవహారం, పార్టీ ప్రక్షాళన వ్యవహారంపై  పెద్ద రచ్చే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news