“స్కంద” మూవీ గురించి బోయపాటి కామెంట్స్… !

-

టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా పేరును సార్ధకం చేసుకున్న వారిలో బోయపాటి మొదటి స్థానంలో ఉంటారు. ఈయన సినిమాలలో హీరోను ఎలివేట్ చేసే విధానం.. ఫైట్స్ , డైలాగ్స్ అన్నీ కూడా మాస్ ను ప్రేక్షకులకు దర్శనం ఇప్పిస్తుంటాయి. ఇక తాజాగా బోయపాటి శ్రీను యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తో కలిసి మరో మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ ను మన ముందుకు తీసుకురానున్నారు. “స్కంద” సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన చాలా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ బోయపాటిని మీ పేస్ లో టెన్షన్ లేదు అంటూ ప్రశ్నించగా ? అందుకు బోయపాటి నేను షూటింగ్ అయ్యేంత వరకు మాత్రమే ప్రతి సీన్ విషయంలో ఎంతో టెన్షన్ పడి తెరకెక్కిస్తాను.. కానీ సినిమా షూటింగ్ అయిపోయి అవుట్ ఫుట్ వచ్చాక ఇక టెన్షన్ పడడం అంటూ ఏమీ ఉండదని సమాధానం ఇచ్చారు.

పైగా సినిమా అవుట్ ఫుట్ కూడా చాలా బాగా వచ్చింది.. నాకు సినిమాపై పూర్తి నమ్మకం ఉందంటూ బోయపాటి చెప్పారు. మరి ఈ స్కంద సినిమా ఎటువంటి ఫలితాన్ని అందిస్తుందో తెలియాలంటే మరో రెండు రోజుల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news