గుళ్ళో అమ్మాయికి ముస్లిం ముద్దులా.. ఇక బాయ్ కాటే !

-

ఇషాన్‌ ఖట్టర్‌ హీరోగా మీరా నాయర్ దర్శకత్వంలో నటించిన సిరీస్ ‘ఎ సూటబుల్‌ బాయ్‌’. ఇందులో బాలీవుడ్‌ నటి టబు సైదా బాయి అనే వేశ్య పాత్రలో నటిస్తుండడంతో ఈ సిరీస్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సిరీస్ ఇప్పుడు వ్వాడంలో చిక్కుకుంది. నెట్ ఫ్లిక్స్ లో చానాళ్ళ క్రితమే విడుదలైన ‘ఎ సూటబుల్ బాయ్’ సిరీస్ లో హీరోయిన్ తన ముస్లిం లవర్ లవర్ తో ఆలయంలో రొమాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న సీన్ల మీద ఇప్పుడు దుమారం రేగింది. బీజేపీ నేత గౌరవ్ గోయల్ దీనికి సంబంధించి కేసు వేశారు. ఈ సీన్లను మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ లో ఉన్న గల శివాలయంలో చిత్రీకరించారని, ఈ సీన్స్ అన్నీ హిందువుల మనోభావాలను గాయపరుస్తూ, లవ్ జీహాద్ ను ప్రోత్సహించేవిధంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతే కాకా నెట్ ఫ్లిక్స్, ఈ సిరీస్ దర్శకనిర్మాత మీరా నాయర్ పైన చర్యలు తీసుకోవాలని రేవా పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. సదరు ఎఫ్ఐఆర్ కాపీతోపాటు తన మొబైల్ నుంచి నెట్ ఫ్లిక్స్ యాప్ ను తొలగిస్తూ ‘బాయికాట్ నెట్ ఫ్లిక్స్’ హ్యాష్ ట్యాగ్ తో ఓ పోస్టు చేశారు. అయితే అనూహ్యంగా ఆయన చేసిన హ్యాష్ ట్యాగ్ త్రెందింగ్ లోకి వేల్లిది. ఇక దీంతో ఆ రాష్ట్ర ఎంపీ నరోత్తం మిశ్రా కూడా స్పందించారు. ఈ సీన్లను పరిశీలించాలని అవి అభ్యంతరకరంగా ఉన్నట్లయితే, వెంటనే నెట్ ఫ్లిక్స్ తో పాటు సిరీస్ మేకర్స్ మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ఏడాది సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సిరీస్ షూటింగ్‌ ఎక్కువ భాగం లక్నో నగరంలోని రాజభవనాల్లో, మధ్య ప్రదేశ్ లోని మహేశ్వరం ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సిరీస్ లో వీరు కాక తాన్య మాణిక్యాల, రసిక దుగ్గల్, షహానా గోస్వామి, నమిత దాస్, వివేక్‌ గోంబర్‌ తదితర నటీనటులు నటించారు.  

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news