హిందీ టీవీ నటి తునిషా శర్మ ఆత్మహత్య సంచలనంగా మారింది.. షూటింగ్ స్పాట్ లోనే ఉరివేసుకొని చనిపోవడం ఇప్పుడు పెద్ద చర్చనీ అంశంగా మారింది అయితే దీని వెనక కారణాలు ఏంటా అంటూ పలు వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఆమె ఆత్మహత్యకు కారణం ప్రియుడు నిరాకరించడమే అంటూ తునిషా తల్లి తన అనుమానాల్ని వ్యక్తం చేస్తుంది..
నటి తునిషా శర్మ 20 ఏళ్ల వయసు లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరిని షాక్కు గురి చేసింది కెరియర్ ఇప్పుడిప్పుడే మంచి స్థితిలో ఉందని ఇలాంటి సమయంలో తినకు అంత బాధ ఎందుకు వచ్చింది అంటూ పోలీసులు విచారిస్తున్నారు అలాగే వ్యక్తిగతంగా తనకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ కూడా విచారణ జరిపిస్తున్నారు..
అయితే ఈ విషయంపై స్పందించిన టునీషా తల్లి మాత్రం ఈ హత్యకు కారణంగా ప్రియుడు షీజాన్ ఖాన్ అని సందేహిస్తుంది. ఇప్పటికే అతనిపై పోలీస్ కేసు పెట్టడం…విచారణ సాగడం తెలిసిందే. తనతో పెళ్లికి షీజాన్ నిరాకరడించడంతో టునీషా సూసైడ్ చేసుకుందని ఆరోపిస్తుంది అలాగే షీజాన్ తుని షా తో పాటు వేరే శ్రద్ధ అనే అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడని ఈ కారణంతోనే పెళ్లికి నిరాకరించాడని చెప్పుకొచ్చింది ఈ విషయంతో మనస్థాపానికి గురైన తునిషా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది..
అయితే ఈ కేసును మరొక కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.. ఆత్మహత్యకు పాల్పడటానికి ఆరు గంటల ముందు టునీషా మ్యాకప్ తో ఉన్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో ఆమె ఎలాంటి బాధ లేకుండా కనిపించడమే కాకుండా చాలా ప్రశాంతంగా ఉంది అయితే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న అమ్మాయి ఇలా ఎందుకు ఉంటుంది అని కూడా అంటున్నారు.. అయితే అసలు విషయం ఏంటి అని తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..