సీఎం కేసీఆర్ ను సతీసమేతంగా కలిసిన హాస్య బ్రహ్మ “బ్రహ్మానందం” … !

-

సినిమాలలో తన హాస్యంతో కడుపు చెక్కలయ్యేలా నవ్వించే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. గత నాలుగు దశాబ్దాలుగా సినిమాలలో నటిస్తూ ఎందరో అనారోగ్యాలను తన నవ్వుతో పోగొట్టిన ఘనుడు బ్రహ్మానందం. వయసు పైబడుతున్న ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ కళామతల్లి బిడ్డనని నిరూపించుకుంటున్నాడు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బ్రహ్మానందం మరియు అతని శ్రీమతి తమ బాబు గౌతమ్ తో కలిసి టీలంగాణ సీఎం కేసీఆర్ ను హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కలిశారు. త్వరలోనే బ్రహ్మ్మనందం కుమారుడు గౌతమ్ వివాహం ఉండడంతో, అందుకు ఆహ్వానించడానికి విచ్చేశారు. ఈ వివాహపుత్రికను బ్రహ్మానందం దంపతులు కేసీఆర్ దంపతులకు అందచేశారు. కాగా స్వయంగా బ్రహ్మానందం గీసిన శ్రీవేంకటేశ్వరుని చిత్ర పటాన్ని కేసీఆర్ కు అందచేయడం జరిగింది.

ఆ తర్వాత కాసేపు కేసీఆర్ తో ముచ్చటించి బయలు దేరి వెళ్లినట్లు సమాచారం. కాగా తాజాగా బ్రహ్మానందం నటించిన బ్రో మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్ లలో రన్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news