నిర్మాత దిల్ రాజు: ఎంపీగా గెలుస్తాను

-

టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు రేపు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనున్నాయి. కాగా ఈ ఎన్నికల అధ్యక్ష బరిలో నిర్మాతలు దిల్ రాజు మరియు సి కళ్యాణ్ లు ఉన్నారు. ఈ సంధర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలలో ఎలాంటి వివాదాలు లేవని క్లారిటీ ఇచ్చారు, ఫిలిం ఛాంబర్ ను బలంగా చేయడానికి నిర్మాతలు అంతా ముందుకు వచ్చి ఎన్నికల బరిలో నిలిచామని చెప్పుకొచ్చారు దిల్ రాజు. మా ప్యానెల్ లో వ్యాపారస్తులు అంతా ఉన్నట్లు పేర్కొన్నారు దిల్ రాజు. దిల్ రాజు మాట్లాడుతూ ఎక్జిబిటర్ లకు ప్రభుత్వాలతో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించడం కోసం సరైన టీం కావాలి అంటూ చెప్పారు. ఇక్కడ రాజకీయాలు వేరు సినిమాలు వీరన్న విషయాన్నీ అందరూ గుర్తించాలి. నేను ఇప్పుడు ఏ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగినా ఎంపీగా గెలుస్తానని చెప్పారు.

కానీ ఈ ఛాంబర్ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిని అయినంత మాత్రాన నాకు ఏమీ కిరీటం.. పెట్టారు కొత్త సమస్యలు, బాధ్యతలు వచ్చి పడతాయంటూ చెప్పారు దిల్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news