గాంధీకి బ్రహ్మీ ఘన నివాళి…

-

ప్రత్యేకంగా బొమ్మను గీసి గాంధీకి ఘనంగా నివాళి అర్పించాడు నటుడు బ్రహ్మానందం. స్వతహాగా చిత్రకారుడు కూడా అయిన బ్రహ్మానందం…గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ బొమ్మను గీసి ఆకట్టకున్నారు. గతంలో కూడా చాలా బొమ్మలను గీసిన బ్రహ్మీ ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచారు. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా తనలోని కళా నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు బ్రహ్మి. సోషల్ మీడియాలో ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.


ఇటీవలే లాక్ డౌన్ రోజుల్లో ఆయన మహాకవి శ్రీశ్రీ చిత్రాన్ని కూడా పెన్సిల్ ఆర్ట్ ద్వారా గీశారు. గతంలో మదర్ థెరెస్సా, రాముడు-హనుమ వంటి చిత్రాలతో అలరించారు. కాగా, ఓ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ, తన సోదరుల్లో చిత్రకారులు కూడా ఉన్నారని తెలిపారు. వాళ్ల ప్రభావం తనపై ఉండేదని, అందుకే బాల్యంలోనే డ్రాయింగ్ అంటే ఆసక్తి పెరిందని చెప్పారు. ఆరో తరగతిలో జోసెఫ్ అనే డ్రాయింగ్ మాస్టారు తనలో చిత్రలేఖనం పట్ల ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారని వివరించారు. స్కూల్లో డ్రాయింగ్ పోటీలు పెడితే అందులో ప్రథమ బహుమతి తనకే వచ్చేదని మురిసిపోతూ చెప్పారు. ఎంఏ చదువుతున్నప్పుడు కూడా బొమ్మలు వేయడం ఆపలేదని, అయితే బొమ్మలు వేసుకుంటూ ఎలా బతుకుతావురా అని జాలి చూపించేవారని బ్రహ్మానందం ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news