గుడ్ న్యూస్ : మారిటోరియం కాలంలో రుణాలపై వడ్డీ మాఫీ

-

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకి ఇబ్బంది లేకుండా విధించిన మారిటోరియం కాలంలో రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై వడ్డీ మాఫీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేసింది. ఆ మేరకు, సుప్రీంకోర్టు లో నిన్న కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో ఈ కేసు సోమవారం మళ్ళీ విచారణకు రానుంది. మార్చి నుంచి ఆగష్టు వరకు నెలవారి చెల్లించాల్సిన రుణాలపై వడ్డీ మాఫీ చేయనున్నట్టు సమాచారం. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలు, విద్యా రుణాలు, గృహరుణాలు, వాహన రుణాలు, క్రెడికార్డుల రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఫ్రొఫెషనల్ రుణాల పై వడ్డీ మాఫీ చేయనున్నారు.

మాజీ కంట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆరు నెలల పాటు అన్ని బ్యాంకు రుణాలపై వడ్డీ మాఫీ చేస్తే, బ్యాంకు లు కుప్పకూలిపోతాయని కేంద్ర ప్రభుత్వం భావించినట్టు ముందు పేర్కొన్నారు. ఆలా అన్ని రకాల బ్యాంకు రుణాలపై వడ్డీ ని మాఫీ చేస్తే సుమారు 6 లక్షల కోట్ల రూపాయల భారాన్ని బ్యాంకులు భరించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది ఈ పరిణామం వలన చాలా బ్యాంకుల మూలధనం మొత్తం కరిగిపోవడమే కాకుండా, బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అభ్యంతరం కేంద్ర ఆర్ధిక శాఖ వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news