కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఏ రేంజ్‌లో చుట్టబెట్టిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని పరిస్థితి. ప్రస్తుతం ఈ వైరస్ బారిన పడని దేశమంటూ ప్రపంచపటంలో ఏదీ లేదు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రారాజ్యాలు సైతం కరోనా వైరస్ ముందు మోకరిల్లాయి. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా బారినపడుతున్నారు. చివరకు దేశాల అధినేతలు సైతం కరోనా బాధితులవుతున్నారు.
తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో (65)కు కరోనా వైరస్ సోకింది. ఇటీవల ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దాంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే బొల్సొనారో కుటుంబ సభ్యులతో పాటు ఇటీవల ఆయన్ను కలిసిన వారిని గుర్తించి వారికి కూడా పరీక్షలు చేస్తున్నారు.