ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ గా ఉన్న డీ. శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరనున్నట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే డీ. శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరడానికి కూడా ముమ్మూర ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కోసం ఢిల్లీ లోని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో దాదాపు గంటకు పైగా చర్చలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే డీ. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది.
అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం, నిజామాబాద్ జిల్లా నాయకత్వం డీ శ్రీనివాస్ చేరికను తీవ్రం గా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో డీఎస్ కుమారుడు ప్రస్తుత బీజేపీ ఎంపీ సోనియా గాంధీపై, రాహుల్ గాంధీ పై అలాగే కాంగ్రెస్ పార్టీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ముందు ప్రస్తావించగా రాహుల్ గాంధీ కూడా డీ ఎస్ చేరిక పై ఆనాసక్తి చూపాడాని తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ లో డీఎస్ చేరికకు దాదాపు బ్రేకులు పడినట్టే అని తెలుస్తుంది.