ఓమిక్రాన్ ఎఫెక్ట్ : నుమాయిష్ కు బ్రేక్

-

ఓమిక్రాన్ ఎఫెక్ట్ నుమాయిష్ పై ప‌డింది. రాష్ట్రంలో రోజు రోజు కు క‌రోనా వైర‌స్, ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండ‌టంతో నుమాయిష్ ను నిలిపివేస్తు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అలాగే అధికారులు నుమాయిష్ సోసైటీ ప్ర‌తినిధులుకు ఫోన్ చేసి నుమాయిష్ ను నిలిపి వేయాల‌ని సూచించారు. అధికారుల ఆదేశాల మేర‌కు ఆదివారం రాత్రి పోలీసులు నుమాయిష్ ను నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పోలీసులు నాంపెల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్ కు వెళ్లి సంద‌ర్శ‌కుల‌ను బ‌య‌ట‌కు పంపించారు. నుమాయిష్ ను నిలిపి వేస్తున్నట్టు మైక్ లో అనౌన్స్ చేశారు.

అయితే 81వ అఖిల భార‌త పారిశ్రామిక ప్ర‌ద‌ర్శ‌న‌ నుమాయిష్ ను తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై శ‌నివారమే ప్రారంభించారు. నుమాయిష్ లోకి రావాలంటే త‌ప్ప‌క మాస్క్ ధ‌రించాల‌ని నో మాస్క్ నో ఎంట్రీ అనే ప‌ద్ధ‌తి కూడా పెట్టారు. అలాగే క‌రోనా నిబంధ‌న‌లు పాటించాడానికి అవ‌స‌రం అయిన చ‌ర్య‌లు కూడా తీసుకున్నారు. అయినా.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. కాగ తెలంగాణ‌లో ఆంక్ష‌ల‌ను జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news