తాజాగా కాంగ్రెస్ అధిష్టానం నుండి కర్ణాటక సీఎం గా సిద్దరామయ్యను ప్రకటిస్తూ అధికారిక నిర్ణయం తీసుకుంది. కేసీ వేణుగోపాల్ కాసేపటి క్రితమే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఈ విషయం ముందుగానే తెలిసిపోయినా అధికారికంగా ప్రకటించడంతో సిద్దరామయ్య వర్గాలలో సంబరాలు నెలకొన్నాయి. ఇదే ప్రకటనలో కర్ణాటక డిప్యూటీ సీఎంగా డక్ శివకుమార్ ను నియమించారు. అదే సమయంలో ప్రస్తుతం కేపీసీసీ చీఫ్ గా ఉన్న డక్ శివకుమార్ ను మళ్ళీ అదే పదవిని ఇస్తూ గౌరవించింది. కాగా శనివారం రోజున సీఎంగా సిద్దరామయ్య మరియు డిప్యూటీ సీఎంగా డక్ శివకుమార్ లు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. వీరితో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం జారుతుందని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
దీనితో గత అయిదు రోజుల నుండి ఎంతగానో ఊరిస్తున్న కర్ణాటక సీఎం అంశం తేలిపోయింది. కాగా ఈ ప్రకటనపై డక్ శివకుమార్ మద్దతుదారులు అసంతృప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం మరోసారి సీనియర్ ల పక్షాన నిలిచింది.