త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా, అమిత్ షా పర్యటన

-

మహాజన్ సంపర్క్ అభి యాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రధానిగా తొమ్మిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు.

Why JP Nadda is the best man to replace Amit Shah as BJP president - India  Today

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న దేశవ్యాప్తంగా ఉన్న పది లక్షల మంది బూత్‌స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగిస్తారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో దేశవ్యాప్తంగా 396 బహిరంగ సభలు ఏర్పాటు చేశామని, వీటిల్లో భాగంగా ఈ వర్చువల్ సమావేశం కూడా ఏర్పాటు చేశామని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా వివిధ రంగాల్లో లక్ష మంది ప్రముఖులతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇందుకోసం 250 ప్రముఖులను ఎంపిక చేసినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news