BREAKING : లిక్కర్ స్కాం కేసులో కవితకు బిగ్ షాక్

-

పండగ పూట బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడి మరోసారి నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసి రేపు తమ ముందు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. కవితను ఈడీ ఇప్పటికే పలు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై గతంలో సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిజినెస్ మేన్ అరుణ్ రామచంద్ర పిళ్లై ఇప్పటికే అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. అంతకుముందే మాగుంట రాఘవ,శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, దినేశ్ అరోరా అప్రూవర్లుగా మారారు. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుండడంతో ,ఇదే సమయంలో మరోసారి ఈడీ నోటీసులు పంపుతుండడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరి ఈసారైనా ఈడీ విచారణకు కవిత హాజరవుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 50 కింద కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు నమోదు చేశారు. సౌత్ గ్రూప్ నుంచి కవితను కీలక వ్యక్తిగా, 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారాలు, ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాలపై కవితను ఈడీ ప్రశ్నించింది.

Read more RELATED
Recommended to you

Latest news