ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత కొన్ని కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జేసి ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతుంది. తాజాగా జేసి ఫ్యామిలీ మీద మరో కేసు నమోదు చేసారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల కోడ్ ఉల్లఘించడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి కేసు నమోదు చేసారు అనంతపురం జిల్లా పోలీసులు.
బృందావనం అపార్ట్ మెంట్ లోని గౌరీనాథ్ రెడ్డి ఫ్లాట్ లో సోదాలు నిర్వహించి క్రికెట్ కిట్లు స్వాధీనం చేసుకున్నారు. 188,171e సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. క్షక్ష్య సాధింపు చర్యలు అంటున్న జెసి వర్గీయులు…. దీనిపై కోర్ట్ కి వెళ్తామని అంటున్నారు. ఇప్పటికే జేసి ఫ్యామిలీ మీద పలు కేసులు నమోదు చేసారు.