రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి ధరలు భారీగా పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఉల్లిని పండించే రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల దెబ్బకు ఉల్లి మొత్తం తడచిపోయింది. భారీ వర్షాలతో దిగుమతులు కూడా ఆగిపోయాయి. ఇక వ్యాపారులు కూడా ఉల్లి కొరతను సృష్టిస్తున్నారు.
మొన్నటి వరకు 50కి వెళ్ళిన ఉల్లి ధరలు, ఇప్పుడు సెంచరీకి వెళ్ళాయి. ఉల్లి కొరత ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు ధరలు అమాంతం పెంచేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా ఉల్లి మహారాష్ట్ర నుంచి వస్తుంది. 80 శాతం దిగుమతి అక్కడి నుంచే వస్తుంది. కర్నూలు జిల్లాలో ఎకరాకు 5 నుంచి 10 క్వింటాల్ మాత్రమే దిగుమతి వస్తుంది. కొన్ని చోట్ల వర్షాలకు ఉల్లి నాని కుళ్ళిపోయింది.